పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారి భగ్గుమన్నాయి.ప్రస్తుతం పెట్రోల్ ,డీజిల్ ధరలు ఏ రోజు పెంచుతున్నారో..ఏ రోజు తగ్గిస్తున్నారో..తెలియడం లేదు. రోజువారీ ధరల సమీక్షతో ఆయిల్ కంపెనీలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి . తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో 35 పైసలు పెరిగి లీటరు పెట్రోల్ ధర రూ.80.76 ఉండగా, డీజిల్ 29 పైసలు పెరిగి రూ.73.45గా ఉంది. మరోవైపు దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో అయితే గరిష్ఠంగా లీటరు పెట్రోల్ ధర రూ.84.07 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.76.24 గా ఉంది. ప్రతిరోజూ ప్రయాణాలు చేసేవారికి పెరుగుతున్న ధరల వలన చాలా కష్టంగా ఉందని, వెంటనే ఆయిల్ ధరలు తగ్గేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రజలుఈ సందర్భంగా వేడుకుంటున్నారు.
