రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తీవ్ర ఉత్కంఠభరిత పరిణామాల నడుమ విశ్వాసపరీక్షకు ముందే సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేశారు.ఈ క్రమంలోనే వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కర్ణాటక ఎన్నికలపై మరోసారి స్పందించారు.కర్ణాటక ఎపిసోడ్లో రాజ్యాంగం గెలిచిందని అన్నారు.ఈ మేరకు అయన శనివారం ట్వీట్ చేశారు.ఇంతకంటే ఘోరంగా రాజ్యాంగ ఉల్లంఘనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగేళ్లుగా కొనసాగుతున్నాయని ఆయన ఈ సందర్భంగావాఖ్యానించారు.అయితే జగన్ చేసిన ఆ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ముఖ్యమంత్రి చంద్రబాబు పై విపరీతంగా సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.
ఆ ట్వీట్ మీకోసం..
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 19, 2018