తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకులకు పదవీ విరమణ వయసు వివాదంపై ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. అర్చకులకు పదవీవిరమణ వయస్సు నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని, శక్తి ఉన్నంత కాలం దేవుడికి సేవ చేసే హక్కు అనువంశీకులకు ఉందన్నారు. టీటీడీలో అవినీతి, అక్రమాలు, ఆగమశాస్త్ర ఉల్లంఘనలపై ప్రశ్నిస్తే ఇలా కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. దశాబ్దాలుగా ఏ పాలకులు చేయని పనిని ఇప్పుడు చేస్తున్నారనన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే పదవీ విరమణ నిబంధనను తొలగిస్తామని జగన్ ట్వీట్ చేశారు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 17, 2018