వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల మధ్య ఆద్యాంతం విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసుకుని.. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది.
జగన్ నడక సాగించిన ప్రతీ రోజూ ప్రజల సమస్యలు అర్జీల రూపంలో వెల్లువెత్తుతున్నాయి. జగన్‌కు సమస్యలు తెలుపుకున్న వారిలో నిరుద్యోగులే ఎక్కువగా ఉండటం గమనార్హం. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జగన్‌ను కలిసిన చిన్నారుల తల్లిదండ్రులు అయితే.. చంద్రబాబు నాయుడు పాలనలో ప్రయివేటు పాఠశాలలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రభుత్వ బడుల నిర్వహణ సరిగ్గా లేదంటూ జగన్‌కు విన్నవిస్తున్నారు. అలాగే, వృద్ధులు, వితంతువులు అయితే.. తమకు మూడు పూటలా కాస్తో.. కూస్తో.. అన్నం పెట్టే పింఛన్ నగదు ఇస్తామని అర్జీలు తీసుకున్న జన్మభూమి కమిటీలు.. నగదు ఇవ్వడంలో జాప్యం చేస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని జగన్‌కు విన్నవిస్తున్నారు. మరో పక్క జగన్‌ను కలిసిన నిరుద్యోగులు.. చంద్రబాబు సర్కార్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో జాప్యం చేయడం తమను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందంటూ తమ బాధలను జగన్‌కు చెప్పుకుంటున్నారు.
ఇదిలా ఉండగా… జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రపై ప్రజల్లో ఆదరణ లభించడంతో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందంటూ ఇటీవల విడుదలైన పలు సర్వేలు తేల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాజకీయ పార్టీల సీనియర్ నేతలు వైసీపీ చేరారు. ఇంకా చేరుతున్నారు కూడాను.
అయితే, తాజాగా పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైఎస్ జగన్ సమక్షంలో రాయలసీమ మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ వైసీపీలో చేరారు. జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే, గత కొద్ది రోజులుగా ఇక్బాల్ ప్రజా సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన విషయం తెలిసిందే.