అశోక్‌బాబు, పేరుకే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘం నేత. కానీ, పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ టీడీపీకి మద్దతు దారుడు. అంతేకాక, చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు ఏ ఉద్యమం చేపట్టినా.. ఆ ఉద్యమాన్ని పక్క దారి పట్టించడంలో అశోక్‌బాబు ముందుంటారన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం వద్ద తాకట్టుపెట్టి మరీ తనపై ఉన్న కేసును కొట్టేయించుకునేందుకు చంద్రబాబు యత్నిస్తున్న సమయంలో.. ప్రత్యేక హోదా కోసం ఐదు కోట్ల మంది ఏపీ ప్రజలు పోరాడుతుంటే.. ఉద్యోగ సంఘం నేతగా ఉన్న అశోక్‌బాబు ఏ ఒక్క రోజు ఉద్యమానికి పిలుపునివ్వకపోవడం.. టీడీపీకి అశోక్‌బాబు ఎంత అభిమానో అర్థమవుతోందని అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.
ఇదిలా ఉండగా.. నేడు విడుదలైన కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో ఇతర పార్టీలకంటే బీజేపీ అత్యధిక సీట్లను గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల ప్రచారం సందర్భంలో బీజేపీకి ఓటు వేయొద్దంటూ సీఎం చంద్రబాబు తన దూత అయిన అశోక్‌బాబును కర్ణాటకకు పంపించిన విషయం విధితమే. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరులోని మాతాళ్ళి, వైట్ ఫీల్డ్ రోడ్‌లోని ఓ హోటల్‌లో ఆంధ్రప్రదేశ్ హక్కుల పోరాట వేదిక పేరిట అశోక్‌బాబు బృందం సమావేశం నిర్వహించింది.
ఆ సమావేశానికి హాజరైన తెలుగు వారిని ఉద్దేశించి అశోక్‌బాబు మాట్లాడుతూ.. బీజేపీకి ఓటు వేయొద్దని, కాంగ్రెస్‌కు ఓటు వేయాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, చంద్రబాబు దూతగా వెళ్లి కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించిన అశోక్‌బాబుకు పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. తెలుగు వారు అత్యధికంగా ఉన్న అసెంబ్లీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అయితే, ఇవాళ విడుదలైన కర్ణాటక ఎన్నికల ఫలితాలను గమనించిన చంద్రబాబు అశోక్‌బాబును పిలిపించి విచారించినట్టు సమాచారం. ఎంతో ఖర్చుపెట్టి.. నీ చేత బెంగళూరులో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తే.. కనీసం తెలుగు వారు ఉన్న అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు రాబట్టలేకపోయామని, దీనికి ఎవరిది బాధ్యత అంటూ అశోక్‌బాబును నిలదీసినట్లు సమాచారం. ఏదేమైనా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో హడావుడి చేసిన అశోక్‌బాబు.. ఫలితాలు విడుదలైన వేళ మీడియాకు కనిపించకపోవడంతో.. చంద్రబాబు పీకిన క్లాస్‌తో అజ్ఞాతంలోకి వెళ్లారేమో అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.