తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) గురువారం స్టే విధించింది. పూర్తి స్థాయి అటవీపర్యావరణ అనుమతులు వచ్చే వరకు ఎలాంటి పనులూ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ అనుమతులు రాకుండానే పనులు మొదలుపెట్టారని ఎన్జీటీలో పిటిషన్ దాఖలు కావడం తెలిసిందే.
దీనిపై విచారణ జరిపిన ఎన్జీటీ ప్రాజెక్టుపై స్టే విధించింది. ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. తాము తాగునీటి అవసరాల కోసమే ప్రాజెక్టు చేపట్టామన్న తెలంగాణ ప్రభుత్వ వాదనను ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకోలేదు.