కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్ల పలితాల్లో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. బీజేపీ ప్రభంజనంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తన విమర్శలను ఎక్కుపెట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు పన్నిన రాజకీయ వ్యూహాలను, కుట్రల్ని కన్నడ ప్రజలు పటాపంచలు చేశారన్నారు. బీజేపీకి ఓటు వేయొద్దని ప్రచారం చేయించినా చంద్రబాబు ఎత్తుగడలను కర్ణాటక తెలుగు ప్రజలు తిరస్కరించారని వ్యాఖ్యానించారు. అంతేకాదు దక్షిణాదిలో తమ విజయ దుందుభి మొదలైందంటూ ట్వీట్ చేశారు.
మరోవైపు ఎన్నికల ఫలితాలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, మరో సీనియర్ నేత పురందేశ్వరి కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో సిద్ధరామయ్య మహిళా వ్యతిరేక విధానాలను ప్రజలు తిరస్కరించారని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. కర్ణాటకలో తమ పార్టీ ఎలా పని చేసిందో తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాగే ముందుకు వెళతామని ఆమె తెలిపారు.