యావత్తు దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ అతిపెద్ద పార్టీగా ..ఏ పార్టీ అధికారాన్ని దక్కించుకుంటుందో ఎన్నికల కౌంటింగ్ మొదలైన మూడు గంటలకే తేలిపోయింది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం రెండు వందల ఇరవై రెండు స్థానాల్లో కౌంటింగ్ పూర్తయ్యే సరికి ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ 72, బీజేపీ 107, జేడీఎస్ 41, ఇతరులు 02 స్థానాల్లో గెలుపొందారు. అయితే 111 స్థానాలను దక్కించుకుని బీజేపీ పార్టీ కర్ణాటక రాష్ట్రంలో అత్యంత పెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది .
అయితే, బీజేపీ గెలుపుకు కారణాలను విశ్లేషించిన పలువురు సీనియర్ రాజకీయ నేతలు పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అందులో ప్రధాన కారణాలను పరిశీలిస్తే.. మొదటగా చెప్పుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలే అన్నది వారి అభిప్రాయం.
అయితే, కర్ణాటక ఎన్నికల సందర్భంలో బీజేపీ ప్రవేశ పెట్టిన పథకాలను పరిశీలిస్తే..!
మిషన్ కాకతీయ- మిషన్ కళ్యాణి
* కల్యాణలక్ష్మీ- వివాహా మంగళ యోజన
* చేనేత రుణాలు రూ. లక్ష వరకు రుణమాఫీ
* టీఎస్ ఐపాస్ తరహాలో పరిశ్రమలకు అనుమతులు
* టీ హబ్- కే హబ్
* జీహెచ్ఎంసీ రూ. 5 భోజన పథకాన్ని ముఖ్యమంత్రి అన్నపూర్ణ క్యాంటిన్స్‌గా తమ మేనిఫెస్టోలో బీజేపీ పొందుపరిచింది.