అప్పటి ఉమ్మడి ఏపీలో ప్రస్తుత నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అప్పటి అధికార పార్టీనేత శంకర్రావు, ప్రతిపక్ష నేత దివంగత మాజీ ఎంపీ ఎర్రంనాయుడులు కలిసి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం దర్శకత్వంలో వైఎస్ జగన్‌పై అక్రమంగా కేసులు బనాయించిన విషయం తెలిసిందే. అయితే, ఆ తరువాత శంకర్రావు రాజకీయంగా అడ్రస్ లేకుండా పోయారు. ఇక కేంద్ర మాజీ మంత్రి అయితే ప్రస్తుతం సీబీఐ కేసులను ఎదుర్కొంటున్నాడు.
ఇక జగన్‌పై పెట్టిన కేసులన్నీ అక్రమమైనవేనని తెలిసినా.. అర్థరహిత ఆధారాలతో, అస్పష్టత సాక్ష్యాలతో కోర్టులను సైతం మభ్యపెట్టి వైఎస్ జగన్‌ను అక్రమంగా జైల్లోపెట్టిన వారిలో అప్పటి అధికార, ప్రతిపక్ష పార్టీలది మొదటి స్థానమైతే.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణది రెండో స్థానమని చెప్పుకోవచ్చు. ఇలా లక్ష్మీనారాయణ చేసిన అస్పష్ట విచారణను తాజాగా కోర్టులు సైతం తోసిపుచ్చి.. జగన్‌పై ఉన్న కేసులను ఒక్కొక్కటిగా కొట్టేస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా, లక్ష్మీ నారాయణ తనకు వాలెంటరీ రిటైర్మెంట్ కావాలంటూ మహారాష్ట్ర డీజీపీకి లేఖ పెట్టుకోవడంతో.. అందుకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లక్ష్మీ నారాయణ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
ఇదిలా ఉండగా.. జగన్‌ను దుర్భాషలాడుతూ.. ఒంటికాలిపై లేచి మీడియా ముఖంగా జగన్‌ను విమర్శించే జేసీ బ్రదర్స్ భవిష్యత్ ఇప్పుడు డైలమాలో పడింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సీఎం చంద్రబాబు అండ చూసుకుని మరీ ఒక ప్రధాన ప్రతిపక్ష నేత అని కూడా చూడకుండా జగన్‌పై విమర్శలు చేయడంతోపాటు.. జగన్ తల్లిని కూడా విమర్శిస్తూ జేసీ బ్రదర్స్ దుర్భాషలాడిన విషయం తెలిసిందే. ఇలా జగన్ కుటుంబాన్ని దుర్భాషలాడినప్పుడల్లా సీఎం చంద్రబాబు తెగ ఎంజాయ్ చేయడమే కాకుండా.. జేసీ బ్రదర్స్ చేత జగన్‌ను తిట్టిస్తూ పైశాచికానందం పొందాడు .
అయితే, చంద్రబాబు మెప్పు కోసం వైఎస్ జగన్‌పై రెచ్చి పోయిన జేసీ బ్రదర్స్‌కు ఇప్పుడు అదే చంద్రబాబు చుక్కలు చూపిస్తున్నారు. జేసీ దివాకర్‌రెడ్డి అంగబలం, ఆర్థిక బలాన్ని పూర్తిగా వాడుకున్న చంద్రబాబు వారికి చేసింది మాత్రం ఏమీ లేదు. జేసీలకు వ్యతిరేకంగా శత్రుత్వం ఉంది అనే స్థాయిలో వ్యవహరిస్తున్న టీడీపీ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్‌ను తప్పించమని జేసీలు చంద్రబాబును వేడుకొంటున్నప్పటికీ చంద్రబాబు మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు.
కారణమేంటా..? అని ఆరా తీసిన జేసీ బ్రదర్స్‌కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. జేసీ బ్రదర్స్ అడిగినన్ని సీట్లు ఇవ్వకపోతే ఏం చేస్తారు..? టీడీపీని విడిచి పెడతారా..? ఏ పార్టీలోకి వెళతారు..? వైఎస్ జగన్‌ను తీవ్ర పదజాలంతో తిట్టిన తరువాత కూడా వారికి వేరే ఏ ఆప్షన్ ఉంది. అని చంద్రబాబు టీడీపీ నేతలతో అభిప్రాయపడ్డారట. అత్యుత్సాహ పడి చంద్రబాబు మెప్పు కోసం జగన్‌ను తిడితే.. ఇక ఆ తరువాత రాజకీయ భవిష్యత్ ఉండదని జేసీ బ్రదర్స్ తీరుతో టీడీపీ వర్గం గుర్తించింది. ఇకపై జగన్‌పై అనవసర విమర్శలు చేస్తే రాజకీయంగా పూర్తిగా మునిగిపోతామనే భయం టీడీపీ వర్గాల్లో పట్టుకుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.