ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకే ప్రతిపక్షనేత ,వైఎస్ జగన్ 2017 నవంబర్ 6వ తేదిన ప్రజాసంకల్పయాత్ర పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. జగన్ పాదయాత్రను ప్రారంభించి ఇవాళ్టికి సుమారు 161 రోజులు అవుతోంది. అయితే వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో చరిత్ర సృష్టించనుంది. జగన్ పాదయాత్ర 2000వేల కిలోమీటర్ల మైలురాయి దాటింది. ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన జగన్ పాదయాత్ర నిన్న (ఆదివారం) ఎనిమిది జిల్లాలు దాటి తొమ్మిదో జిల్లాలోకి అడుగుపెట్టింది. పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు వైఎస్ జగన్‌కు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. అడుగడుగునా జననేతకు బ్రహ్మరథం పడుతున్నారు. వెంకటాపురంలో వైఎస్ జగన్ పాదయాత్ర రెండు వేల కిలోమీటర్ల మార్క్ దాటింది. ఈ సందర్భంగా వెంకటాపురంలో 40 అడుగుల పైలాన్‌ను వైఎస్ జగన్ ఆవిష్కరించారు.
