ఈ రోజు మాతృ దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మకు శుభాకాంక్షలు తెలిపారు.తాను ఈ స్థాయిలో ఉండటానికి అమ్మే కారణమని అయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఈ ప్రపంచంలో అమ్మతనానికి మించిన హీరోయిజం లేదని చెప్పారు. అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు అని ఆయన ట్వీట్ చేశారు.
There’s no heroism greater than motherhood. Thank you Amma, for making me what I am today. Happy #MothersDay.
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 13, 2018
కాగా ప్రస్తుతం జగన్ తన పాదయాత్ర 160వ రోజును కైకలూరు శివారు ప్రాంతం నుంచి ప్రారంభించారు.ఈ రోజు రాత్రి మహేశ్వర పురంలో బస చేయనున్నారు. జగన్ పాదయాత్ర రేపటికి 2000 కిలోమీటర్ల మైలురాయిని తాకనుంది.