వర్ధన్నపేట శాసనసభ్యులు అరూరి రమేష్ రైతుబంధు చెక్కుల పంపిణీలో మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు .రైతుబంధు చెక్కుల పంపిణీలో భాగంగా నేడు పర్వతగిరి మండలంలో పర్యటిస్తున్నారు. మండలంలోని రావూరు గ్రామంలో చెక్కుల పంపిణీ నిమిత్తం వెలుతుండగా దుక్కి పనులు చేసుకుంటున్న రైతును గమనించి అధికారుల ద్వారా రైతు వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే అరూరి రమేష్ … స్థానిక తహసీల్దార్ సహయంతో ఆ రైతు పెద్దపెల్లి నర్సయ్య పట్టా పాసుపుస్తకాన్ని,రైతుబంధు చెక్కును ఆ రైతు వద్దకే వెళ్ళి ఆందజేసి రైతును ఒకింత ఆశ్చర్యానికి గురిచేయగా,అనుకోని అతిథిగా తన వద్దకే స్థానిక శాసనసభ్యులు వచ్చి చెక్కునందజేయడంతో ఆ రైతు ఉబ్బితబ్బిబ్బైయ్యాడు.
ఈ సందర్భంగా రైతు పెద్దపెల్లి నర్సయ్య మాట్లాడుతూ.. తనకు ఎ ఎ 3-09 గుంటలు ఉండగా 12,900వేల రూపాయలు వచ్చినట్టు కూపన్ ద్వారా తెలియజేసారని,చల్లటి పూట దుక్కి పని చేసుకోని ఆ చెక్కును,పట్టాపాసుపుస్తకాన్ని తీసుకోవాలనుకున్న అని ఇంతలోనే మా శాసన సభ్యులు నా వద్దకే వచ్చి ఇవ్వడం సంతోషగా ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వమని,సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని కోద్దిరోజుల ముందే నా కూమార్తె కళ్యాణలక్ష్మీ ద్వారా 75000/- అందుకున్నామని తన యొక్క సంతోషాన్ని వెలిబుచ్చాడు.