మంచి నటుడిగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్‌గా పేరు సంపాదించుకున్న ప్రభుదేవా.. మరోసారి పెళ్ళికొడుకు కాబోతున్నాడు.ఇంతకముందు నయనతారతో గత కొన్ని సంవత్సరాల క్రితమే వివాహం కాగా.. కొన్ని మనస్పర్ధల కారణంగా ఆమెకు విడాకులు ఇచ్చాడు.అయితే తాజాగా ప్రభుదేవాను పెళ్లి చేసుకోవడానికి నికీషా పటేల్ సై అంటుంది.
ఇంతకీ నికీషా పటేల్ ఎవరనుకుంటున్నారా..? జనసేన అధినేత,ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించిన కొమురం పులి సినిమాలో హీరోయిన్ గా పరిచయమైంది.ఆ సినిమా తరువాత ఆమెకు తెలుగులో అవకాశాలు రాకపోవడంతో కొలీవుడ్ లోకి వెళ్ళింది.తాజాగా ఈమె కోలీవుడ్‌లో ‘పాండిముని’ చిత్రంలో నటిస్తోంది.రెండేళ్ళ తర్వాత తమిళంలో నటిస్తున్న నికీషాని మీడియా మీకు ఏ హీరో నటన అంటే ఇష్టం అని ప్రశ్నించింది.
అందుకు ఆమె చాలా మంది హీరోల నటన ఇష్టం.. ముఖ్యంగా ప్రభుదేవా అంటే చాలా ఇష్టమని చెప్పింది. మా రెండు కుటుంబాల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ఓకే అంటే నేను ప్రభుదేవాని పెళ్లిచేసుకోవడానికి రెడీ.. అని అందరికీ షాక్ ఇచ్చింది నికీషా పటేల్.