అందరికి మెరుగైన వైద్యం అందాలి అని ప్రపంచ నర్సెస్ దినోత్సవం సందర్భంగా నర్సింగ్ ఆఫీసర్స్ అస్సోసిషన్ ఆధ్వర్యంలోమే 12 నాడు రవీంద్రభారతిలో ఉదయం 9 గంట నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు నర్సెస్ మహాసభ నిర్వహిస్తున్నారు.ఈ సభలో నర్సింగ్ వృత్తిలోని నిపుణులుప్రజారోగ్యంలో నర్సెస్ యొక్క పాత్రపై వివిధ అంశాలవారిగా మాట్లాడనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి హాజరువుతారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. మరియు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.వారి చేతుల మీదిగా ఉత్తమ నర్సుల అవార్డులు కార్యక్రమం జరుగనుంది.తెలంగాణ రాష్ట్రం లోని 31 జిల్లాల నుండి ప్రజారోగ్యoలో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రభుత్వ మరియ ప్రవేటు వైద్యశాలలో పనిచేస్తున్న నర్సులను గుర్తించి రాష్ట్రస్థాయిలో ఉత్తమ నర్సింగ్ అవార్డులను అందజేయడం జరుగుతుంది అని నర్సింగ్ ఆఫీసర్స్ అధ్యక్షుడు శ్రీను రాథోడ్ తెలిపారు.
అలాగే లక్ష్మణ్ రూడవత్ మాట్లాడుతూ..మన నర్సస్ యొక్క సేవలను తేలియజేయటనికి మన సమాజములో వైద్యారంగములో నర్సస్ ఒక వెన్నుముకలాంటివాలు అని, మన విలువలను అభివృద్ది పథంలో నడిపించుటకు మన నైతిక విలువలను కాపాడుటకు మనము అందరమూ కలిసి కట్టుగా అడుగులు వేయాలని మన నర్సింగ్ వ్యవస్థ మరింత అబివృద్ది కావాలని వేలమంది ప్రజలకు మంచి వైద్యాన్ని అందించాలని కోరారు.