కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల అభివృద్దే లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ సీ ఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో మెదక్ జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవనాల నిర్మాణానికి కుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి బహిరంగసభలో సీఎం మాట్లాడుతూ..”దేశంలో ఎక్కడలేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.ప్రపంచంలో ఎక్కడలేని విధంగా రైతన్నకు ఎకరాకు ఎనిమిది వేలు ఆర్థిక సాయమిస్తున్నం.కాళేశ్వరం నీళ్ళు ఈ ఏడాది చివర మెదక్ జిల్లాకు వస్తాయి తెలంగాణ రాష్ట్రంలో నీటితీరువా బకాయిలు రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
రైతులు ఏ కార్యాలయానికి వెళ్లకుండా భూ రికార్డుల ప్రక్షాళన 100 రోజుల్లో పూర్తి చేయగలిగాం. 2014 కంటే ముందు తెలంగాణలో విద్యుత్ ఉంటే వార్త.. ఇవాళ విద్యుత్ పోతే వార్త.మంజీరా నదిపై 10చెక్ డ్యాములు కడతాం ..నారాయణఖేడ్ ,జహీరాబాద్ లో లక్షలాది ఎకరాలకు సాగునీళ్ళు..మెదక్ లో ఉన్న 100పడకలు ఆస్పత్రిని 300పడకల ఆస్పత్రిగా మారుస్తాం ..రాష్ట్రంలో ప్రతిపక్షాలకు 80శాతం మందికి డిపాజిట్లు కూడా దక్కవు” అని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.