తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి ఈ రోజు బుధవారం బీర్కూరులో ఒక వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బాన్సువాడ నుండి బయలు దేరి వెళ్లారు .ఈ క్రమంలో మార్గం మధ్యలో కొల్లూరు గ్రామానికి చెందిన రైతులు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ ను ఆపారు .
కాన్వాయ్ ను ఆపి మరి ఈ ఏడాది సమయానికే నిజాం సాగర్ ప్రాజెక్టు నుండి నీళ్ళు రావడమే కాకుండా ఏకంగా ఇరవై నాలుగు గంటల కరెంటును ప్రభుత్వం అందించడంతో ఒక్క గుంట కూడా ఎండిపోకుండా వేసిన పంట వేసినట్లే ఎక్కువ దిగుబడి వచ్చిందని చెబుతూ మంత్రికి ,సర్కారుకు కృతఙ్ఞతలు చెప్పారు .
అంతే కాకుండా గత రెండేండ్లుగా పంటలు సరిగా పండటంతో ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నాం ..పశువుల మేతకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు .పండించిన పంటను కూడా మద్దతు ధరకే అమ్మగలుగుతున్నాంఅని చెబుతూ తమ ఆనందాన్ని వ్యక్త పరిచారు కొల్లూరు రైతాంగం .