ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 155వ రోజు పాదయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా గుడివాడ నెహ్రౌచౌక్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో పేదల గురించి ఆలోచించిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. గుడివాడలో పేదల కోసం 5 వేలకు పైగా ఇళ్లు కట్టించిన ఘనత వైఎస్సార్‌దేనని తెలిపారు. పేదలకు ఉచిత వైద్యం అందించడం కోసం ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారని వైఎస్సార్ సేవల్ని గుర్తుచేసుకున్నారు. స్థానికులను తాగునీటి కష్టాల నుంచి బయటపడేసేందుకు వైఎస్సార్, గుడివాడలో 106 ఎకరాల్లో చెరువు తవ్వించారు. దేవుడు రూపంలో వచ్చిన వ్యక్తి వైఎస్సార్ అని కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధికి ఆటంకం ఏర్పడిందని, వైఎస్ జగన్ అధికారంలోకొస్తే ఏపీ ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. అంతేగాక పట్టిసీమ అని చెబుతాడు ఇక్కడ ఉన్న పనికి రాని మంత్రి ..పనికిమాలిన వాడు దేవినేని ఉమా… పట్టిసీమ ద్వారా డెల్టాను కాపాడినని చెబుతాడు..రాయలసీమకి నీళ్లు ఇచ్చిన అని చెబుతాడు…వాడు అంటూ ఫైర్ అయ్యాడు కొడాలి నాని.. ఈ క్రింది వీడియో చూడండి