ఏపీలో రాజధాని ప్రాంత రైతుల తరఫున పోరాడుతున్నందుకే తనపై కేసులు పెట్టారని రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.దేశంలోనే సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో టీడీపీ అధినేత , సీఎం నారా చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికినా కేసులుండవని ఆయన తెలిపారు.
టీడీపీ ప్రభుత్వం తమను ఎన్ని ఇబ్బందులు పెట్టినా రైతులకు వైసీపీ అండగా ఉంటుందని ఆయన చెప్పారు.అధికారాన్ని అడ్డుపెట్టుకొని పెట్టె అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఆర్కే అన్నారు. తమ అభిప్రాయాలను మినిట్స్ బుక్లో రాయమన్నందుకు ఆర్కే సహా రైతులపై ప్రభుత్వం కేసులు పెట్టింది. ఆర్కే సహా 13 మంది రైతులకు సమన్లు అందాయి. నవంబర్7న విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.