ఆమె తెలుగు తమిళం కన్నడ ఓరియా ఇలా నాలుగు భాషాల్లో ఏడు వందలకు పైగా సినిమాల్లో నటించిన అత్యంత సీనియర్ నటి .ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలంగాణ గడ్డ మీద అది కూడా ఉద్యమాల గడ్డ ఓరుగల్లు గడ్డ మీద జన్మించిన నటి .ఆమె సంగీత .సంగీత రాజకీయాల్లోకి వస్తారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి .తన పొలిటికల్ ఎంట్రీ మీద వస్తున్న వార్తల మీద
సంగీత స్పందించారు .
ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో నటుడు అలీ హోస్ట్ గా వ్యవహరించే కార్యక్రమంలో పాల్గొన్న సంగీత పొలిటికల్ ఎంట్రీ గురించి స్పందిస్తూ తనకు రాజకీయాల్లోకి రావాలని ఉంది .అయితే తనకు పదవుల మీద వ్యామోహం లేదు .తనలాంటి కళాకారులకు ఏదైనా సాయం చేయాలనీ ఆరాటం మాత్రమే .అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారిని కలిశాను .
అప్పుడే నాలాంటి కళాకారులకు ప్రభుత్వ తరపున ఎమన్నా సాయం చేయాలనీ కోరాను .ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకే అన్నారు .అనుకున్నట్లే చేస్తున్నారు .అయితే తన వంతుగా కూడా చేయాలనే రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నాను .అయితే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంటుంది కాబట్టి కళాకారులకు అండగా ఉండటానికి బాగుంటుందని అలోచించి టీఆర్ఎస్ పార్టీలో చేరాలని అనుకుంటున్నాను .అయితే తనకు ఎటువంటి పదవులు వద్దు .కేవలం ఒక కార్యకర్తగా అందరికి అందుబాటులో ఉంటూ అందరికి న్యాయం చేయాలనీ మాత్రమే ఆలోచిస్తున్నాను అని ..అయితే తన నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తాను అని ఆమె చెప్పుకొచ్చారు ఆ కార్యక్రమంలో ..