ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు దెబ్బ దెబ్బ తగులుతుంది .రాష్ట్రంలో కడప జిల్లాకు చెందిన బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే జయరాములు త్వరలోనే టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తాను ప్రకటించిన విషయం మరిచిపోకముందే తాజాగా తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తారు అనే వార్తలు వస్తున్నాయి .
తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున గెలుపొందిన బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ఇటివల ప్రకటించారు.అందులో భాగంగా బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా కొత్త పార్టీ ఉంటుందని ఆయన తెలిపారు కూడా .
అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హమీలల్లో ఒక్కటి కూడా అమలు చేయకపోవడం ..ఏపీలో అధికారంలో ఉండి కూడా బీసీలకు అన్యాయం చేస్తుండటంతో కృష్ణయ్య టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి పార్టీ పెట్టనున్నారు అని వార్తలు వస్తున్నాయి .అయితే టీడీపీ పార్టీకి రాజీనామా చేయడం వెనక ఉన్న ప్రధాన కారణం ఏపీలో తను అధ్యక్షుడిగా ఉన్న ఒక ఉద్యోగ సంఘానికి ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలంటే అధ్యక్షుడిగా కృష్ణయ్య తప్పుకుంటేనే ఇస్తామని బాబు సర్కారు మెలిక పెట్టడమే అని కూడా వార్తలు వస్తున్నాయి ..