గత కొంతకాలంగా జరుగుతున్న లైంగిక దాడులపై దేశవ్యాప్తంగా సినీ నటులు స్పందిస్తున్నారు. కథువాలో 8 సంవత్సరాల బాలికపై జరిగిన లైంగిక దాడిని సినీ నటులు తీవ్రంగా ఖండించారు. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు దాచేపల్లిలో మృగాడి దాడిలో తీవ్రంగా గాయపడిన మైనర్ చిన్నారిపై జరిగిన లైంగిక దాడిపై సినీ నటి పూనమ్ కౌర్ తీవ్రంగా స్పందించింది. బాలికపై లైంగిక దాడి జరిపిన వ్యక్తి అంగాన్ని నరికివేయాలి అని పూనమ్ ట్వీట్ చేసింది. చిన్నారిపై దుర్మార్గానికి ఒడిగట్టిన అతడిని కఠినంగా శిక్షించాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. లైంగిక కోరికలను అదుపుచేసుకొలేని, మానవ రూపంలో ఉన్న మృగాలు జీవితాలను చాలా దారుణంగా మారుస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరుగకుండా ఆ వ్యక్తిని పబ్లిక్ ఉరితీయాలి. మళ్లీ మగాడినని భావించకుండా ఆ వ్యక్తి అంగాన్ని నరికివేయాలి అని పూనమ్ ట్వీట్ చేసింది. మరోపక్క వైసీపీ ఎమ్మెల్యే రోజా విలేకరులతో మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి, డీజీపీ ఉన్న చోట ఈ ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘోరాలకు పాల్పడుతున్న వారిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వారి మద్దతుదారులే ఎక్కువ మంది ఉన్నారు. పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నార’ని రోజా ఆవేదన వ్యక్తం చేశారు.
This uncontrollable sexual and animal instincts of few men is making life horrible ,,,, if all of this is true ..this man should b hanged till death in front of public … your mind should b chopped along the organ which makes u a male not a man … ????? pic.twitter.com/PumoQFhhD8
— Poonam Kaur Lal (@poonamkaurlal) May 3, 2018