సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్..మరోసారి మానవత్వం చాటుకున్నారు. ట్విట్టర్ వేదికగా ప్రతిరోజూ కేటీఆర్ ను ఎంతోమంది సాయం కోరుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం (మే-1) కేటీర్ సాయం కోరుతూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు రామకృష్ణ అనే వ్యక్తి. ముప్పన సిందుజ అనే అమ్మాయి బ్రెయిన్ లో నరాలు బ్రేక్ అవడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హస్పిటల్ చేర్చారు.
అయితే అమ్మాయి కండిషన్ సీరియస్ కావడంతో సర్జరీ చేయాలని చెప్పారు డాక్టర్లు. ఆపరేషన్ కి రూ. పది లక్షలు అవుతాయని డాక్టర్లు చెప్పడంతో అమ్మాయి ఫ్యామిలీ ఆందొళనలో పడ్డారు. అమ్మాయి టైలరింగ్ చేసేది.. వారిది మధ్యతరగతి కుటుంబం. దీంతో మంత్రి కేటీఆర్ సాయం కోరుతూ.. సిందుజకి అండగా నిలవాలని కోరుతూ ట్విట్ చేశారు.
దీనిపై వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్..అమ్మాయి ఆపరేషన్ కి తాను ఖర్చు భరిస్తానన్నారు. ఇందుకోసం సిందుజ ఫ్యామిలీని తన ఆఫీసులో కలువమని ట్విట్టర్ లో రిప్లై ఇచ్చారు కేటీఆర్. దీనికి సంబంధించి వెంటనే ట్విట్టర్ ద్వారా పేషెంట్ వివరాలను తెలుసుకున్నారు కేటీఆర్ ఆఫీస్ అధికారులు. దీంతో సాయం చేయండంలో మీకు సాటి ఎవరూలేరు కేటీఆర్ సార్ అంటు కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.