వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రస్తుత అధికార టీడీపీ పార్టీకి మంచి పట్టున్న కృష్ణా జిల్లాలో విజయవతంగా కొనసాగుతుంది. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర నేటికి 151వ రోజుకు చేరుకుంది. జగన్ ఇప్పటి వరకూ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. అయితే ఒట్టి చేతులతో టీడీపీ గోడలను పగుల గొట్టగల ధీరుడు వైఎస్ జగన్ అని వైసీపీ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆనాడు కాంగ్రెస్ గోడలను ఆయన ఇప్పటికే బద్దలు కొట్టారని ఆయన వ్యాఖ్యానించారు.
వైఎస్‌ఆర్‌ను వ్యతిరేకించే వాడు మానవ ద్వేషి అయి ఉంటాడని భూమన అన్నారు. మహానేత వైఎస్‌ఆర్ ఆలోచనలే తమ పార్టీ సిద్ధాంతమని తెలిపారు. సిద్ధాంతం లేదని విమర్శించే వారికి ఇదే తమ సమాధానమని భూమన పేర్కొన్నారు. వైసీపీకి పరిపూర్ణ ఆలోచన ఉందని, రాజకీయం అంటే అధికారం అనే సిద్ధాంతం చంద్రబాబుదని విమర్శించారు. జీవితాంతం గర్వపడేలా చెప్పుకునే నాయకుడు జగన్ అని, అధికారం ఒకరు వేస్తే తీసుకునే భిక్ష కాదని, పోరాడి సాధించుకునే హక్కు అన్న వ్యక్తి వైఎస్ జగన్ అని భూమన పేర్కొన్నారు. 10 జన్‌పథ్‌లో నిటారుగా వైఎస్ జగన్ నిల్చున్నారని, వందసార్లు కుంగదీయడానికి ప్రయత్నించినా లొంగని మనిషిగా అభివర్ణించారు. 5 కోట్ల ఆంధ్రులకు వైఎస్సార్ పాలనను అందిద్దామని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.