Home / TELANGANA / రైతుబంధు చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీపై సీఎం కేసీఆర్ సమీక్ష

రైతుబంధు చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీపై సీఎం కేసీఆర్ సమీక్ష

రైతు బంధు పథకం ద్వారా రాష్ట్రంలోని రైతులకు అందించే పంట పెట్టుబడి కోసం అవసరమైన నిధులను సమకూర్చి, బ్యాంకుల్లో సిద్ధంగా ఉంచినట్లు ముఖ్యమంత్రి   కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన చెక్కులను బ్యాంకుల ద్వారా వెంటనే నగదుగా మార్చుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేసినట్లు సీఎం ప్రకటించారు. మే 1 నాటికి రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల్లో రూ.4,114.62 కోట్లు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మరో రెండు వేల కోట్ల నగదును విడుదల చేయించడం కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు బుధవారం రిజర్వ్ బ్యాంకు అధికారులను కలుస్తారని చెప్పారు. త్వరలోనే మరో రెండు వేల కోట్ల రూపాయలు వస్తాయని, చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయ్యే నాటికే మొత్తం 6వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో సిద్ధంగా ఉంటాయని చెప్పారు. ఎస్.బి.ఐ, తెలంగాణ గ్రామీణ బ్యాంకు, గ్రామీణ వికాస్ బ్యాంకు, కెనరా బ్యాంకు, ఐఓబి, కార్పొరేషన్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, సిండికేట్ బ్యాంకుల్లో డబ్బులున్నట్లు చెప్పారు. రైతుల కోసం సిద్ధంగా ఉంచిన డబ్బులను బ్యాంకర్లు ఇతర అవసరాల కోసం ఎట్టి పరిస్థితుల్లో వాడవద్దని, అవి రైతుల కోసం ఉంచాలని చెప్పారు. రైతులకు ఇవ్వాల్సిన దాదాపు అన్ని చెక్కులు, అన్ని పాస్ పుస్తకాల ముద్రణ పూర్తయి, మండలాలకు చేరుకున్నాయని స్పష్టం చేశారు.

Image may contain: 1 person, sitting and indoor

రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 8వేల చొప్పున పంట పెట్టుబడి అందివ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం, ఈ నెల 10 నుంచి మొదటి విడత డబ్బులను చెక్కుల రూపంలో అందిస్తుంది. ఈ కార్యక్రమం ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఎస్.కె.జోషి, ప్రభుత్వ సలహాదారు  అనురాగ్ శర్మ, ముఖ్య కార్యదర్శులు  ఎస్.నర్సింగ్ రావు,   పార్థసారథి,   రామకృష్ణరావు,   రాజేశ్వర్ తివారి,   శాంత కుమారి, వ్యవసాయ శాఖ కమిషనర్   జగన్మోహన్ రావు, భూ పరిపాలన డైరెక్టర్   వాకాటి కరుణ, ఐటి కమిషనర్   వెంకటేశ్వరరావు, ఓఎస్డి   రజిత్ షైనీ, సీఎం ప్రత్యేక కార్యదర్శి  స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

Image may contain: 4 people, people sitting

‘‘రాష్ట్ర వ్యాప్తంగా 57.33 లక్షల పాస్ పుస్తకాలు రైతులకు అందివ్వాలని నిర్ణయించాం. ఇందులో 4.60 లక్షల మంది తమ ఆధార్ కార్డులను అనుసంధానం చేయలేదు. ఆధార్ కార్డు అనుసంధానం చేసిన 52,72,779 మందికి చెక్కులు, పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తాం. ఎండలు తీవ్రంగా ఉండడం వల్ల పంపిణీ కార్యక్రమాన్ని ఉదయం 7-11 గంటల మధ్య, సాయంత్రం 5-7:30 గంటల మధ్య నిర్వహించాలి. ఈ నెల 10న కార్యక్రమం ప్రారంభిస్తాం’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

Image may contain: 3 people, people sitting, table and indoor

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat