తిరుమల తిరుపతి‘వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి నమ్మక ద్రోహం చేశారు. హోదా ఇస్తామన్న హామీ వారి మేనిఫెస్టోలోనే ఉంది… ఈ రోజు బుకాయిస్తున్నారు. తిరుపతి తారకరామా స్టేడియంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ధర్మపోరాట సభ ఎర్పాటు చేశారు. ఈ సందర్భంగా 2014 ఏప్రిల్ 30న జరిగిన ఎన్నికల బహిరంగ సభలో నరేంద్రమోదీ ఇచ్చిన హామీల ప్రసంగం వీడియోను సభలో ప్రదర్శించారు. ఢిల్లీలో ఉండే ప్రధాని ఉలిక్కిపడి లేచేలా ఈ సభ పెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధర్మపోరాట సభలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. తాను ప్రధానిపైనా, కేంద్రంపై పోరాడుతుంటే… కలిసి రావాల్సింది పోయి కొందరు తనను విమర్శిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎప్పుడూ మాట్లాడని పవన్ కల్యాణ్ కూడా తనను విమర్శిస్తున్నారన్నారు. టీడీపీకి ఎవరిపైనా కోపం లేదని, పొట్టకొట్టినప్పుడు తిరగబడుతామని హెచ్చరించారు.
అయితే మరోపక్క హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబే దీక్ష చేయడమేంటని ప్రజలు ఆశ్చర్యపోతున్నారని వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం అన్నారు. చంద్రబాబూ.. దొంగ దీక్షలతో ప్రజలను మోసం చేయలేవని పేర్కొన్నారు. కరువు, చంద్రబాబు కవల పిల్లలని అభివర్ణించారు. చంద్రబాబు ‘ఆల్ ఫ్రీ’ అంటూ అందరినీ ముంచారని, మాయామాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. బాబు దీక్షలో ఉంటే…టీడీపీ నేతలు, కార్యకర్తలు అదే తిరుపతిలో వైన్ షాప్స్ దగ్గర ధర్మ దీక్ష చేస్తున్నారని అన్నారు.