తియ్యటి ద్రవపదార్థాలతో నోరూరించే పండు ఏదని ప్రశ్నిస్తే టక్కున చెప్పేది సీతాఫలం. పోషక విలువలు కలిగే పేదోడి ఆపిల్‌గా పేరొందిన ఈఫలాన్ని తినేందుకు ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు. పైనాపిల్, అరటిపండు రుచులను మేళవించి సహజ సిద్ధంగా లభించే సీతాఫలాలు పట్టణంలో దొరుకుతుండడంతో కొనుగోలుదారులు సీతాఫలాలను చూసి లొట్టలు వేసుకుంటున్నారు. శీతాకాలంలో సీతాఫలం ఆరోగ్యప్రదాయకమంటూ ధరలను లెక్క చేయకుండా కొనుక్కొని రుచులను ఆస్వాధిస్తున్నారు.
శీతాకాలంలో అభించే అతిమధురమైన పండు సీతాఫలం సెప్టెంబర్ నుంచి నవంబర్నెల వరకు ప్రజలు ఎక్కువగా ఇష్టపడి కొనుగోలు చేస్తారు. ఈ పండులో మాంసకృత్తులు, పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు, శరీరానికి బలాన్నిచ్చే కొవ్వు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి.
వీటితో పాటు శరీరాకృతిని పరిరక్షించే యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సీ పుష్కలంగా అందుతుంది. జీర్ణ ప్రక్రియను మెరుగుపర్చే పీచు, బీ-6 విటమిన్, పొటాషియం, కాంప్లెక్స్ కార్బొ హైడ్రేడ్లు కూడా సీతాఫలంలో పుష్కలంగా ఉంటాయి. శరీరం చురుగ్గా ఉండెందుకు కావాల్సిన మెగ్నీషియం కూడా ఈపండునుంచే లభిస్తుంది.
వంద గ్రాముల సీతాఫలం గుజ్జు రోజూ తింటే దాదాపు 10శాతం మెగ్నీషియం శరీరానికి అందుతుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటు కండరాలకు విశ్రాంతి నివ్వకుండా గుండె జబ్బుల బారినుంచి కాపాడడంలో మెగ్నీషియం కీలకపాత్ర పోషిస్తున్నది.
బరువు పెరగాలనుకునేవారు, హైపర్ థైరాయిడ్‌తో బాధపడుతున్న వారికి సీతాఫలానికి మించిన పండు మరొకటిలేదు. అధికబరువు స్థూలకాయంతో బాధపడేవారు సీతాఫలాలను ఎక్కువగా తీసుకోవద్దు. శరీరంలో అధిక చెక్కర చేరకుండా ఉంచడం సీతాఫలం ప్రత్యేకత…