మాజీ స్పీకర్, మాజీ మంత్రి పి.రామచంద్రారెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రామచంద్రారెడ్డితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పంచాయితీరాజ్ వ్యవస్థ బలోపేతానికి కృషి చేసిన తొలితరం నాయకుడిగా రామచంద్రారెడ్డికి దేశ వ్యాప్తంగా పేరుందని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రామచంద్రారెడ్డి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషిని ఆదేశించారు. సిఎం ఆదేశాల మేరకు రామచంద్రారెడ్డి అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.