రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులతోపాటు, ఇతర కార్మికులందరికీ ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. భవ ననిర్మాణ కార్మికులందరికీ బీమా అమలుచేయాలన్నారు. మేడే తర్వాత మరోసారి సమావేశం నిర్వహించి కార్మిక సంక్షేమానికి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. కార్మిక సంక్షేమంపై శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో సంఘటిత, అసంఘటిత కార్మికులు ఎంతమంది ఉన్నారు? వారి ఆరో గ్యం, సంక్షేమం, బీమా విషయంలో తీసుకుంటున్న చర్యలేమిటి? అనే విషయంలో సమగ్ర నివేదిక రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కార్మికుల్లో ఎంతమంది ఈఎస్ఐ ప్రయోజనాలు పొందుతున్నారో తేల్చి, మిగతావారికి కూడా ఆ సదుపాయం కల్పించేందుకు కార్యాచరణ రూపొందించాలని చెప్పారు.
కార్మికులందరికీ ఆధార్ కార్డు అనుసంధానం చేయాలని, కార్మికశాఖలో రిజిస్ట్రేషన్ చేయించాలని చెప్పారు. సమావేశంలో కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, విఠల్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రవీందర్‌కుమార్, జీవన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శి నదీం పాల్గొన్నారు.