అక్కడ అన్నా చెల్లెళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. పేరుకి మంత్రి హోదా ఇచ్చారే కానీ.. అధికారాలు మాత్రం ఇవ్వలేదు. ఉప ఎన్నికల్లో అతడిని భుజాన ఎత్తుకుని మోశారు. ఇప్పుడు పట్టించుకునే వారే లేరు. టీడీపీ రాజకీయాలేంటో అర్థమైన ఆ అన్నా చెల్లెళ్లు అండ కోసం ఎదురు చూస్తున్నారు. తల్లి మరణంతో ఆళ్లగడ్డ నుంచి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికైన అఖిలప్రియ టీడీపీలోకి ఫిరాయించి మంత్రి అయ్యారు. కొద్ది రోజులు అంతా బాగానే ఉంది. కానీ, తండ్రికి ఆత్మలా పనిచేసిన ఏవీ సుబ్బారెడ్డి నుంచే అఖిల ప్రియకు పోరు మొదలైంది. అది వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి ఏవీ సుబ్బారెడ్డి నేనే పోటీ చేస్తాననే స్థాయికి చేరింది. ఇక జిల్లాలో తొలి నుంచి భూమా కుటుంబంతో పడని వారంతా ఇప్పుడు ఒక్కటయ్యారు. భూమా అఖిలప్రియను రాజకీయంగా ఎదగనీయకుండా చేస్తున్నారు. ఇక టీడీపీని పూర్తిగా నమ్మితే తమ కుటుంబానికి రాజకీయంగా బద్ద విరోధి అయిన గంగుల ప్రభాకర్‌రెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చారు. ఒక వైపు గంగుల, మరో వైపు ఏవీ సుబ్బారెడ్డి వచ్చే ఎన్నికల్లో ఆళ్ల గడ్డ నుంచి మేమే పోటీ చేయబోతున్నామంటూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చేస్తున్నారు.
see also : భారతినైనా కాపాడుకో..! జగన్‌పై ఎమ్మెల్యే వల్లభనేని సంచలన వ్యాఖ్యలు..!!
ఇక నంద్యాల ఉప ఎన్నికల్లో అధికారం మాటున అన్ని రకాల ప్రయోగాలతో టీడీపీ నుంచి గెలిచి తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు భూమా బ్రహ్మానందరెడ్డి. అయితే, రాజకీయాలకు పూర్తిగా కొత్త కావడం, కేవలం భూమా మరణంతో సానుభూతి ఓట్లతో, పార్టీ అభ్యర్థిగా తనను గెలిపించుకునేందుకు మాత్రమే తనకు సీటు ఇచ్చారన్న విషయం ఇప్పటికి గానీ బ్రహ్మానందరెడ్డికి అర్థం కాలేదు. ఇక ఇప్పుడు అయితే, బ్రహ్మానంద పరిస్థితి మరీ దారుణం.. ఎమ్మెల్యేగా అలా గెలిచాడో లేదో.. అప్పట్నుంచి బ్రహ్మానందరెడ్డిని పట్టించుకునే వారే లేకపోయారు. అఖిలప్రియ వైఖరి కారణంగా దూరమైన పార్టీ నేతలు ఇప్పుడు బ్రహ్మానందరెడ్డిని దూరం పెడుతున్నారు. దీంతో ఈ ఒక్కసారికే తాను ఎమ్మెల్యేనన్న విషయం బ్రహ్మానందరెడ్డికి దాదాపు అర్థమైపోయింది.
see also : పవన్ కళ్యాణ్ మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు …!
ఇక అఖిలప్రియకు సీటు ఇస్తారో కూడా డౌటే. ఒక వేళ టీడీపీ నుంచి సీటు ఇచ్చినా పార్టీపరంగానే కాకుండా, తమవైపు ఉన్న వర్గం వారు సహకరించని పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడు ఉప ఎన్నికల సమయంలో నంద్యాల ప్రజలకు ఇచ్చిన హామీలు, ఆళ్లగడ్డలో అభివృద్ధి పనులు ప్రజలు సంతృప్తి చెందే విధంగా లేవనే వాదనలను ప్రజలు వినిపిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ నుంచి శిల్పా కుటుంబం నంద్యాల నుంచి వచ్చే ఎన్నికల్లో ప్రతీకారం కోసం అన్నట్లుగా ఇప్పటి నుంచే పనిచేసుకుపోతున్నారు. ఆళ్లగడ్డ నుంచి గంగుల కుమారుడు ఇప్పటికే జగన్ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వచ్చేశారు.
మరో వైపు ఆళ్లగడ్డలో వైసీపీ పరిస్థితి మెరుగ్గానే కనిపిస్తోంది. కానీ, సీట్ల కోసం పచాయతీలు లేకపోవడంతో వారి పరిస్థితి మెరుగ్గానే కనిపిస్తుంది. కానీ, టీడీపీని నమ్ముకున్న అన్నా చెల్లుల రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో ఎవరికీ అర్థం కావడం లేదు. దీంతో వైసీపీ టిక్కెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలను, ప్రతిపక్ష నేత జగన్‌ను మోసం చేసి పార్టీ ఫిరాయించిన వీరికి తగిన శాస్తే జరుగుతుందంటూ కర్నూలు జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇలా భూమా ఫ్యామిలీ ఎప్పుడైతే.. చంద్రబాబు మాట విని.. టీడీపీలో చేరారో.. అప్పుడే ఆ ఫ్యామిలీ పొలిటికల్ ఛాప్టర్ క్లోజ్ అయిందని రాజకీయ విశ్లేషకుల మాట.