గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొందిన ఎంపీ కొత్తపల్లి గీత ఆ తర్వాత అధికార టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశచూపిన తాయిలాలకు ,ప్రలోభాలకు తలొగ్గి వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కారు .అయితే తాజాగా ఆమె పార్టీ సభ్యత్వం గురించి ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు
చేశారు .
ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు దీక్షలతో ఎన్నో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అని ఎంపీ కొత్తపల్లి గీత ఆరోపిస్తున్నారు అని విలేఖరు ప్రశ్నించగా సమాధానమిస్తూ ఎంపీ కొత్తపల్లి గీత తమ పార్టీ సభ్యురాలు కాదు అని ఆయన వ్యాఖ్యానించారు ..