ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాజ్యసభ సభ్యులు అయిన విజయసాయి రెడ్డి మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు .గత నూట నలబై ఐదు రోజులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే .
జగన్ పాదయాత్రకు మద్దతుగా తను కూడా పాదయాత్ర చేయాలనీ విజయసాయి రెడ్డి నిర్ణయించుకున్నారు .అందులో భాగంగా విజయసాయి రెడ్డి విశాఖ పట్టణంలో వచ్చే నెల 2వ తేది నుండి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని డెబ్బై రెండు వార్డుల్లో దాదాపు పదిరోజుల పాటు నూట ఎనబై కిలో మీటర్ల దూరం పాదయాత్ర చేయాలనీ ఆయన నిర్ణయం తీసుకున్నారు .
అంతే కాకుండా ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ద్రోహానికి నిరసనగా నగరంలో ఈ నెల ముప్పై తారీఖున ప్రభుత్వ మహిళా కాలేజీ ఎదురుగ ఉన్న దీక్షా ప్రాంగణం వేదికగా నయవంచన దీక్షలు చేయనున్నట్లు ఆయన తెలిపారు ..