తెలంగాణ ప్రభుత్వంపై దురుద్దేవపూర్వక శత్రుత్వం పెంచుకున్న కొడంగల్ ఎమ్మెల్యేకు షాకుల పరంపర కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ కంటే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌లో చేరడం ద్వారా మరింత ఎదురుదాడి చేయాలని రేవంత్ భావిస్తే…ఆయనకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇస్తోంది, అవమానాల పాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. తాజాగా ఆయనకు జరిగిన అవమానం..పాదయాత్రకు బ్రేకులు వేయడం.
కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇంతలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రజాచైతన్య బస్సు యాత్ర ప్రారంభించారు. బస్సు యాత్ర జరుగుతుండగా పాదయాత్రలు చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని వీరంతా ప్రయత్నాలు వాయిదా వేసుకున్నారు. బస్సు యాత్ర పూర్తయ్యాక పాదయాత్ర చేద్దామని భావిస్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకులకు అధిష్ఠానం ఊహించని షాక్ ఇచ్చింది. వ్యక్తిగత పాదయాత్రలు వద్దని అధినేత రాహుల్‌గాంధీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో రేవంత్ రెడ్డి కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉంండిపోయారు. అసలు తాను పాదయాత్ర చేయాలని అనుకోలేదని , అలాంటి ఆలోచన టీడీపీలో ఉండగా చేశానని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.