పురుషోత్తపట్నం రెండో దశ పూర్తితో తన రికార్డును తానే దాటిన మేఘా..
- దేశంలో ఐదు నదులలను ఎత్తిపోతలల ద్వారా అనుసంధానం చేసిన ఘనత ‘మేఘా’దే
- మధ్యప్రదేశ్ మొదలుకొని ఏపీ వరకు నదులల అనుసంధానంలో మేఘా పాత్ర
- తాజాగా పురుషోత్తపట్నం రెండో లిప్ట్ ద్వారా గోదావరి`ఏలేరు నదులల అనుసంధానం
- గతంలో పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణ నదులల సంగమం
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట వద్ద పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ మొదటిదశను గత ఏడాది ఆగస్టు 15న ముఖ్యమంత్రి శ్రీ. చంద్రబాబు నాయుడు ప్రారంభించిన విషయం తెలిసిందే. రెండో దశ నిర్మాణ పనులతో పాటు ట్రయల్రన్ను పూర్తిచేసుకొని గోదావరి నది నుంచి ఏలేరుకు నీటిని తరలించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిన వెంటనే గోదావరి నుంచి ఏలేరుకు గోదావరి జలాలు పరిగెత్తనున్నాయి.
మొదటిదశలో రెండు పంపుల ద్వారా నీటి పంపింగ్ను 225 రోజుల్లో అందించగలిగింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం వల్ల గోదావరి నుంచి సముద్రంలో కలిసే మూడువేలు క్యూసెక్కుల నీటిని మళ్లించి ఉత్తరాంధ్రతోపాటు ఉభయగోదావరి జిల్లాలు, ఇతర ప్రాంతాలకు సాగు, తాగు నీటి అవసరాలకోసం ఉపయోగించుకునే అవకాశం.
పరుగులు పెడుతున్న పురుషోత్తపట్నం…
గోదావరి–ఏలేరు నదుల అనుసంధానానికి ఉపయోగపడే పురుషోత్తపట్నం రెండో లిఫ్ట్ పనులను మేఘా ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ప్రస్తుతం గోదావరిలో నీటి లభ్యత లేదు. ఈ ఏడాది జూన్ తరువాత గోదావరిలోకి నీరు వస్తే పురుషోత్తపట్నం పథకంలోని రెండు లిఫ్ట్లను ఉపయోగించి ఏలేరు జలాశయానికి నీటిని మళ్లిస్తారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాకు ప్రయోజనం చేకూర్చే ఏలేరు జలాశయంలో నీటి లభ్యత తక్కువగా ఉండటం వల్ల ఆయకట్టు పూర్తిగా సాగులోకి రావటం లేదు. ఇప్పుడు పురుషోత్తపట్నం పూర్తి కావటం ద్వారా ఆ ప్రాంత రైతులు కలలు నెరవేరనున్నాయి. ఇందులో కీలక భూమిక పోషించే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని అనేక అడ్డంకులు అధిగమించి 225 రోజుల్లో మొదటి లిఫ్ట్ను మేఘా సంస్థ పూర్తి చేసింది.
గత ఏడాది ఆగస్టు 15న మొదటి దశను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. నాటి నుంచి (ఆగస్టు 25) నుంచి నవంబర్ 28వ తేది వరకు ఏలేరు ఆయకట్టుతో పాటు ఏలేరు రిజర్వాయర్కు 1.60 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం జరిగింది. తొలిదశలో 10 పంప్లు, 10 మోటార్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాజెక్ట్ రెండోదశలో 8 పంప్లు, 8 మోటార్లను ఏర్పాటు చేశారు. ట్రయల్రన్ని కూడా విజయంతవంగా పూర్తి చేసి నీటిని ఏలేరు రిజర్వాయర్లోకి ఎత్తిపోశారు. రెండో దశను ప్రభుత్వం ప్రారంభించాల్సి ఉంది. మొదటిదశలో 5 వరుసల పైప్లైన్లు ఒక్కొక్కటి 10.10 కిలోమీటర్ల పొడవున 3.20 మీటర్ల డయాతో మొత్తం 54 కిలోమీటర్ల పైప్లైన్లు ఏర్పాటు చేశారు. రెండోదశలో ఒక్కొక్కటి 13.11, 5 కిలోమీటర్ల పొడవున రెండు పైప్లైన్లు 3.20మీటర్ల డయాతో మొత్తం 27 కిలోమీటర్ల పొడవున నిర్మించారు. ఈ ప్రాజెక్ట్లో భాగంగా తొలి దశలో 220/11 కెవి సబ్స్టేషన్లు నిర్మించి నిమిషానికి 90 మెగా వాట్ల విద్యుత్ను ఉపయోగించుకోవడానికి అనుమతి కూడా లభించింది.
నదుల అనుసంధానంలో మేఘా మొదటి అడుగు…
మేఘా ఇంజనీరింగ్ మధ్యప్రదేశ్‌లోని నర్మదా–క్షిప్రా సింహస్థ నదులను అనుసంధానించే ఎన్‌కేఎస్‌ఎల్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేసి రికార్డు సృష్టించింది. ఈ ప్రాజెక్టును 2014 మార్చి 27న పూర్తిచేసి మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి అందచేసింది. ఎన్‌కేఎస్‌ఎల్ ప్రాజెక్టు ద్వారా మాల్వా ప్రాంతంలోని గ్రామాలు, పట్టణాల్లోని లక్షలాది ప్రజలకు తాగునీరు అందుతున్నది. ఇది దేశంలోనే తొలి నదీ అనుసంధాన ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. మధ్యప్రదేశ్లో మాల్వా ప్రాంతం అత్యంత వెనుకబాటు తనానికి గురైంది. నీటి సమస్య తీవ్రంగా ఉంది. 400 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రాంతానికి నీటిని కాలువల ద్వారా అందించడం సాధ్యం కాదు. అందుకే ప్రభుత్వం నర్మదా–క్షిప్రా సింహాస్థ అనుసంధానం చేపట్టింది. 2012 అక్టోబర్ 12న ఈ పనిని ఏంఈఐఎల్కు ప్రభుత్వం అప్పగించగా సకాలంలో పూర్తిచేయడంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రారంభించారు.
5 క్యూమిక్క్ల నీటిని 47 కిలోమీటర్ల పొడవునా సరఫరా చేసి అందించేందుకు మూడు దశల్లో ఎత్తిపోతలను 27.5 మేఘావాట్ల సామర్థ్యంతో మేఘా పూర్తిచేసింది. 228 మీటర్ల నుంచి 576 మీటర్లకు నీటిని పంపింగ్ చేసే విధంగా ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేసింది.
కెసి కాలువకు వరం..ముచ్చుమర్రి
మేఘా సంస్థ చేపట్టిన మరో నదీ అనుసంధాన ప్రాజెక్టు ముచ్చుమర్రి. శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను ఎత్తిపోతల ద్వారా కెసి కాలువకు.. కర్నూల్ జిల్లాలోని కెసి కాలువ ఆయకట్టుకు అవసరమైన నీరు తుంగభద్ర నుంచి లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం కృష్ణా నీటిని శ్రీశైం వెనుకభాగంలో ఎత్తిపోతల ద్వారా కెసి కాలువకు మళ్లించేందుకు హంద్రీనీవా పథకంలో భాగంగా ముచ్చుమర్రిని చేపట్టింది. దీనిని ఏంఈఐఎల్ గత ఏడాది సెప్టెంబర్లో పూర్తిచేసి నీటిని అందించడం ప్రారంభించింది.
హంద్రీనీవా సుజల స్రవంతి మొదటి దశలో రెండో ప్యాకేజ్ కింద దీనిని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కేసీ కెనాల్పై మూడు పంప్హౌజ్లను, మూడు రెగ్యులేటర్లను నిర్మించారు. దీని ద్వారా కృష్ణ జలాలను కెసి కెనాల్కు తరలిస్తున్నారు. ఇది పెన్నా– కృష్ణ నదుల అనుసంధానంలో భాగంగా చెప్పవచ్చు.
ఈ ప్రాజెక్టును సవాల్గా తీసుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ అనుకున్న సమయానికంటే ముందుగానే నిర్మాణం పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా 2017 సెప్టెంబర్ నుంచి 2018 మార్చి నాటికి 3.12 టీఎంసీల నీటిని పెన్నాకు తరలించింది.
హంద్రినీవా అద్భుతం.. అదే మేఘాతో సాద్యం..
అది ఒకప్పుడు కల… మరోవైపు ఆశ.. ఈ రెండిరటి మధ్య ఆరాటం–పోరాటం… ఎట్టకేలకు ఆచరణలో సాధ్యమైంది. అదే హంద్రినీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం. భారీ ఎత్తిపోతల పథకాలు విజయవంతం కాబోవని బలమైన వాదన వినిపిస్తున్న నేపథ్యంలో అత్యంత క్లిష్టమైన, ఎత్తైన ఎత్తిపోతల పథకాన్ని విజయవంతం చేసి వారి అనుమానాలు పటాపంచలు చేయటంలో మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) కీలక పాత్ర పోషించింది. అత్యంత పొడవైన, ఎత్తైన ప్రాంతానికి నీటిని హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా పంపింగ్ చేయటానికి అవసరమైన మౌలిక వసతులైన పంపింగ్ స్టేషన్లను నిర్మించి తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకోగలిగింది. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఈ పథకం ఒక సాంకేతిక అద్భుతం (ఇంజనీరింగ్ వండర్).
దేశంలోనే మొట్ట మొదటి అతి పెద్దదైన ఎత్తిపోతల పథకం హెచ్ఎన్ఎస్ఎస్. మొదటిదశలోనే 8 పంపింగ్ స్టేషన్లను ఎంఈఐఎల్ నిర్మించింది. ప్రతీ పంపింగ్ స్టేషన్లోనూ 12 చొప్పున భారీ పంపింగ్ సెట్లు ఉన్నాయి. వీటిల్లో సరాసరిన 200 మీటర్ల ఎత్తుకు నీటిని పంపింగ్ చేస్తున్నారు. మాల్యా వద్ద 254 మీటర్లు ఉండగా, 8వ పంపింగ్ స్టేషన్ వద్ద 438 మీటర్లు ఉంది. ఇంతటి క్లిష్టమైన, ఎత్తైన, పొడవైన ఎత్తిపోతల పథకం దేశంలో ఇంతవరకు ఇంకెక్కాడ ప్రారంభం కాలేదు. ఏపిలోనే మొదటిది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హంద్రీనీవా సుజల స్రవంతికి మోటార్లు పంపులు బిగించటం ద్వారా కృష్ణ నీటిని పెన్నాకు మేఘా సంస్థ తరలించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 2017 సెప్టెంబర్ నుంచి 2018 మార్చి మధ్యలో 29.08 టీఎంసీ నీటిని తరలించారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ పధకం కింద ఏర్పాటు చేసిన పంపులు ఎలాంటి అవరోధాలు లేకుండా పనిచేస్తున్నాయి.
పట్టిసీమలో గోదావరి–కృష్ణా పరుగులు..
మేఘా సంస్థ చేపట్టిన అనుసంధాన ప్రాజెక్ట్ల్లో అత్యంత ప్రముఖమైన ప్రాజెక్టు పట్టిసీమ. ఎందుకంటే దక్షిణభారత దేశంలోనే అత్యంత పెద్దవైన గోదావరి–కృష్ణా నదులను అనుసంధానించిన ప్రాజెక్టు పట్టిసీమ. అది కూడా ఎత్తిపోతల ద్వారా సాధ్యం కావటం. పైగా అతి తక్కువ సమయంలో అంటే నిర్దేశించిన గడువులోగా పూర్తిచేయటం మేఘాకే సాధ్యమైంది.
2015 మార్చి 29న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా.. గడువు కాన్నా ముందుగా 2016 మార్చి 29 నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎంఈఐఎల్ పూర్తి చేసింది. ఇందుకు గాను లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. కేవలం 163 రోజుల్లోనే తొలి విడుత గోదావరి జలాను కృష్ణకు మళ్లించడం ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా 24 మోటార్ల ద్వారా గోదావరి జలాను పోలవరం కుడి కాల్వలో ఎత్తిపోస్తారు. తొలి ఏడాది 2015లో 93 రోజుల్లో 4 టీఎంసీల నీటిని, 2016లో 137 రోజుల్లో 55.6 టీఎంసీల నీటిని, 2017లో కేవలం 148 రోజుల్లో 100 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోయడం ద్వారా పట్టిసీమ ప్రాజెక్టు సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇది ఎంఈఐఎల్ సాధించిన మరో గుర్తించదగిన విజయం.