ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .నిన్న కాక మొన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయత్ర కృష్ణా జిల్లాలో అడుగుపెట్టగానే టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి దాదాపు మూడు వేలమంది తన భారీ అనుచవర్గంతో సహా వైసీపీ కండువా కప్పుకున్న సంగతి
తెల్సిందే.
తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ పార్టీలో చేరాలని ముహూర్తం ఖరారు చేసుకున్నారు .అందులో భాగంగా ఈ నెల ఇరవై ఐదో తారీఖున తన అనుచవర్గంతో సహా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు .
అందుకు తగిన ఏర్పాట్ల గురించి మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ నిన్న ఆదివారం జరిగిన కార్యకర్తల ,అనుచరుల సమావేశంలో చర్చించారు .కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా వైసీపీలో చేరడం వలన ఆ పార్టీకి మంచి ఊపునిస్తుంది అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు ..