తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పై రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు.ఉనికి కోసమే కాంగ్రెస్ పార్టీ నేతలు బస్సు యాత్రలు చేస్తున్నారని విమర్శించారు.ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు అమలు కావడం లేదని కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారని.. పథకాల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా అని టీ కాంగ్రెస్ నేతలకు మంత్రి తలసాని సవాల్ విసిరారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కులవృత్తులను ప్రోత్సహిస్తున్నామని ..మరికొద్ది రోజుల్లో తెలంగాణ.. కోనసీమలాగా ఆకుపచ్చగా మారుతుందన్నారు.