ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయం వేడెక్కింది.ఎన్నికలు సమీపిస్తున్న తరణంలో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ నుండి వైసీపీ పార్టీలోకి వలసలు జోరందుకున్నా యి.ఇప్పటికే పలువురు నేతలు టీడీపీ పార్టీ నుండి వైసీపీలో చేరగా .. తాజాగా మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త వసంత కృష్ణప్రసాద్ వైసీపీ లో చేరబోతున్నారు .
ఈ మేరకు ఆయన ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సంప్రదింపులు జరిపారు. అయితే టీడీపీలో తగిన ప్రాధాన్యం లేకపోవడంతో కృష్ణ ప్రసాద్ వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కృష్ణప్రసాద్‌కు వైఎస్ జగన్ మైలవరం సీటు ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. కొద్ది రోజుల క్రితం కృష్ణప్రసాద్ వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్న విషయం తెలియగానే ప్రస్తుత అధికార టీడీపీ నేతల ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు. గుంటూరు జిల్లాలో సీటు ఇస్తామంటూ సీఎం నచ్చజెప్పినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేతలు కూడా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వ్యాపారాల వల్ల ఎప్పటి నుంచో వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో.. ఆయన వైసీపీ వైపు మొగ్గు చూపారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌ను కలిసారు. మైలవరం నుంచి పోటీ చేయాల్సిందిగా జగన్ సూచించారు. ఈ సందర్భంగా జగన్ సూచన కు కృష్ణప్రసాద్ కూడా అంగీకరించినట్లు తెలిసింది. ఈ వారంలో మంచి రోజు చూసుకుని జగన్ సమక్షంలో వైసీపీలో చేరతారని కృష్ణప్రసాద్ అనుచరులు అంటున్నారు.అయితే కృష్ణప్రసాద్ వైసీపీ పార్టీ లో చేరబోతున్నారని దరువు.కాం ముందే చెప్పింది.