ప్రముఖ నటుడు కమల్‌హాసన్… ఇన్నాళ్లూ తమిళ రాజకీయాలపై సామాజిక మాధ్యమాల ద్వారా విమర్శలు గుప్పించిన ఆయన ఇటీవల పార్టీ ఏర్పాటు ప్రయత్నాల్లోకి దిగారు. ఇందులో భాగంగా బుధవారం స్థానిక ఆళ్వారుపేటలోని తన నివాసంలో అభిమాన సంఘాల జిల్లా స్థాయి నేతలతో వేర్వేరుగా సమావేశమయ్యారు.అయన నవంబరు 7వ తేదీన పార్టీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలిసింది.
పార్టీ పెడితే ఎలా ఉంటుంది? ఎలాంటి వారితో చేతులు కలపాలి? పార్టీ ఏర్పాటు తరువాత ప్రజల్లోకి ఎలా వెళ్లాలి? తదితరాలపై ఆయన అభిమానుల వద్ద ఆరా తీశారు. పార్టీ పెడిగే ప్రజా స్పందన ఎలా ఉంటుందన్నదానిపైనా వారితో చర్చించినట్లు సమాచారం. నవంబర్ 7వ తేదీన పార్టీ ప్రారంభించనున్నట్లు కూడా సూచాయగా అభిమానులకు తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నిర్ణయంతో అభిమానులు సంతోషంగా ఉన్నారు. తమ అభిమాన కథానాయకుడి కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని అభిమానులు మీడియాకు తెలిపారు.
Post Views: 233