ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీలోకి చేరడానికి ప్రణాళికలు సిద్ధం చేస్కుంటున్నారా ..ఇప్పటికే గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసిన పలు అవినీతి అక్రమాలతో పాటుగా ఎన్నికల హామీలను నేరవేర్చకపోవడం ..విభజన హామీలను సాధించడంలో విఫలమవ్వడంతో రానున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీకి అధికారం దక్కదని పలు సర్వేలు వస్తున్న నేపథ్యంలో తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఈ సీనియర్ నాయకులు ఆలోచనలు చేస్తున్నరా ..అంటే అవును అనే అంటున్నారు టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ..
గతంలో మంత్రి పదవుల విస్తరణ ,పార్టీ పదవుల పంపకం సమయంలో బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ “పార్టీలో ఎప్పటి నుండో కష్టపడుతున్న ..పార్టీకి అండగా ఉంటున్నవారిని వదిలేసి మధ్యలో వచ్చినవారికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఏమి బాగోలేదు ..పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఇప్పటికే టీడీపీ అధినేతపై తీవ్ర అసంతృప్తి నెలకొన్నది .వారు తమ తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఏ క్షణమైనా సరే పార్టీ మారే అవకాశాలు ఉన్నట్లు కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారు.అప్పుడు ఆయన మాట్లాడిన మాటలను ఇప్పుడు నిజం చేస్తున్నారు టీడీపీ పార్టీకి చెందిన నేతలు .
అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాలో రామచంద్రాపురం అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ,సీనియర్ నేత అయిన తోట త్రిమూర్తులు పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు అని జిల్లా రాజకీయాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇప్పటికే వైసీపీ పెద్దలతో త్రిమూర్తులు చర్చలు కూడా జరిపారు .అందులో భాగంగా తను వైసీపీ పార్టీలో చేరితే తన సిట్టింగ్ స్థానానికి ఎటువంటి ప్రమాదం లేకుండా మాజీ మంత్రి అయిన పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఎమ్మెల్సీ పదవిచ్చి త్రిమూర్తులు చేరికకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయింది అని అంటున్నారు రాజకీయ వర్గాలు .తోట త్రిమూర్తులు రేపో మాపో ఒక భారీ బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేసి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు అని అతని అనుచవర్గం చెబుతున్నారు.చూడాలి మరి సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి చెప్పినట్లుగా ఎంత మంది వైసీపీలో చేరతారో ..