తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రాష్ట్ర రాజధానిలోని హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త చెప్పారు.ఈ మేరకు ఇవాళ అయన ఓ ట్వీట్ చేశారు.శనివారం ఉదయం నుంచి రద్దీ సమయాల్లో ప్రతి 7 నిమిషాలకో మెట్రో రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.కొత్త సిగ్నలింగ్ వ్యవస్థకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ(సీఎంఆర్‌ఎస్) అనుమతి ఇచ్చిందని…ఈ విషయాన్నిహైదరాబాద్ నగర ప్రయాణికులతో పంచుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Happy to announce CMRS has cleared the new signalling system & Hyderabad Metro will now run trains every 7 minutes during peak hours & every 8 minutes during non-peak on Miyapur – Ameerpet- Nagole stretches from tomorrow 6 am onwards
— KTR (@KTRTRS) April 20, 2018
ఈ క్రమంలో మియాపూర్ – అమీర్‌పేట్ – నాగోల్ మధ్య రేపు ఉదయం 6 గంటల నుంచి రద్దీ సమయాల్లో ప్రతి 7 నిమిషాలకు మెట్రో రైలు ఒక రైలు బయల్దేరనుంది.