తెలుగుదేశం పార్టీ అధినేత ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి 68వ పుట్టిన రోజు నేడు.ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ఘనంగా బాబు పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు.ఈ నేపధ్యంలో ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ చేశాడు.చంద్రబాబు ఆయురారోగ్యాలతో నిండు జీవితం గడుపాలని ఆకాంక్షించారు.కాగా నేడు చంద్రబాబు ప్రత్యేక హోదా కోరుతూ ఒక్కరోజు దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.
Warm birthday greetings to @ncbn garu. May God bless you with a long and healthy life.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 20, 2018