గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో శ్రీరెడ్డి సంచలనాలు రేపుతుంది. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పేరుతొ అమాయకమైన ఆడపిల్లల జీవితాలను బలిచేస్తున్నారని ఆమె ఆరోపిస్తుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి మాట్లాడమని..అందుకు 5 కోట్లు ఇస్తానని ప్రముఖ దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ చెప్పాడని శ్రీ రెడ్డి తమన్నా సింహాద్రి తో మాట్లాడిన ఆడియో టేప్ ఒకటి బయటికి వచ్చిన విషయం తెలిసిందే.
see also :
ఫలించిన ప్రభుత్వ ఒత్తిడి..హైదరాబాద్కు విమానంలో నోట్లు
ఈ నేపధ్యంలో శ్రీ రెడ్డిని , తమన్నా సింహాద్రిని వైసీపీ నేతలే పవన్ పై విషప్రచారం చేసేవిధంగా మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో తమన్నా సింహాద్రి స్పందించింది.ఇవాళ ఓ ప్రముఖ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ..శ్రీ రెడ్డి ఇవాళ రాత్రి 12 గంటల తరువాత ఫోన్ చేసిందని..రాంగోపాల్ వర్మ ఫోన్ చేసి..పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి మాట్లాడమని అన్నారని అందుకోసం 5 కోట్లు ఇస్తానని అన్నారని..నేను చనిపోతా అక్క అంటూ శ్రీ రెడ్డి నాతో భాధపడిందని చెప్పారు.
భరత్ అనే నేను సూపర్ హిట్..తేల్చేసిన ప్రముఖ క్రిటిక్..!!
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో తమన్నా సింహాద్రి వైసీపీ నాయకురాలని వైరల్ అవుతున్న ఫోటో పై స్పందిస్తూ..ఆ ఫోటో ఇప్పటిది కాదని తెలిపింది. తన బాబాయ్ వైసీపీ లీడర్ అని..అతనితో గతంలో ఒక సెల్ఫీ దిగానని చెప్పింది.ఇప్పుడు ఆ ఫోటోని జనసేన ,టీడీపీ నేతలు కావాలనే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపింది.అలాగే శ్రీరెడ్డికి వైసీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది తమన్నా సింహాద్రి.వైసీపీకి తనకు ఏమాత్రం సంబంధం లేదని తానెపుడూ వైసీపీ జెండా కూడా పట్టుకోలేదని స్వార్థ ప్రయోజనాల కోసం వైసీపీపై బురద జల్లేందుకు కొంతమంది చూస్తున్నారని చెప్పింది.సోషల్ మీడియాలో తన ఫోటోలను పై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై త్వరలోనే పోలిస్ కేసు పెడతానని తెలిపింది.శ్రీ రెడ్డి వెనుక ఉంది రాంగోపాల్ వర్మేనని స్పష్టం చేసింది తమన్నా.