జూపల్లి కుమారులు తీసుకున్న బ్యాంకు రుణాలపై సీబీఐ నోటీసులు పంపించిందని సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు.ఇవాళ టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు..తమ కుటుంబం పై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తామని..క్రిమినల్ కేసులు పెట్టుతామని తెలిపారు.నేను సంపాదించుకున్న మంచి పేరును అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నాలు కావాలనే కాంగ్రెస్ నేతలు చేస్తున్నారని తెలిపారు.వ్యాపారం కోసం మెత్తం తీసుకున్న అప్పులో ఇప్పటికే రూ.31కోట్లు చెల్లించామని మంత్రి వెల్లడించారు.
