తెలుగు ఇండస్ర్టీని నమ్ముకుని యాక్టింగ్ స్కూళ్లకు వేలకు వేలు దారపోసి నటనలో శిక్షణ తీసుకుని వచ్చిన తెలుగు వారికే ఎక్కువ శాతం అవకాశాలు ఇవ్వాలని నటి శ్రీరెడ్డి చేస్తున్న పోరాటం టాలీవుడ్‌లో పెద్ద దుమారాన్నే రేపుతోంది. కాగా, నటి శ్రీరెడ్డి ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చిన క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై ఇవాళ నాగబాబు, నటి హేమ స్పందించారు. అయితే, మూడు పెళ్లిళ్లు చేసుకున్న జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌కు మహిళలంటే గౌరవం లేదని, మహిళలంటే ఆటబొమ్మలా చూసే వ్యక్తిత్వం పవన్ కల్యాణ్‌ది అంటూ నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
see also : నాగబాబుపై సంచలన పోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి..
see also : పవవన్ మూడు పెళ్లిళ్లపై నాగబాబు స్పందన..!!
ఈ నేపథ్యంలో ఇవాళ మీడియా సమావేశంలో నటి హేమ మాట్లాడుతూ.. ఒక ప్రముఖ టీవీ ఛానెల్ వాళ్లు నా చెల్లీ.. నా బంగారు తల్లీ అంటూ నటి శ్రీరెడ్డి చేత నడిరోడ్డుపై బట్టలు విప్పించారని, ఆ తరువాత మేమే బట్టలు కప్పామంటూ వారికి వారే మీడియాలో వేసుకోవడం హాస్యాస్పందంగా ఉందన్నారు. మరో ఛానెల్ వారు సినీ ఇండస్ర్టీలోని మహిళా నటులంతా డాష్ ముండలు అంటున్నారని ఈ వ్యాఖ్యలన్నీ తనను ఎంతో ఆవేదనకు గురి చేశాయన్నారు. పోనీ మీరే చెప్పడం. పలాన రంగంలో మహిళలపై దాడులు జరగడం లేదని, ఆ రంగంలో వెళ్లి జాబ్ చేసుకుంటానంటూ.. మీడియా వాళ్లను ప్రశ్నించింది నటి హేమ. దేశంలోని ప్రతీ చోటా మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎవరైనా ఒక మహిళ నడి రోడ్డుపై నిలబడితే.. రూ.1000లు, రూ.2వేలు ఇస్తా.. వస్తావా.. అని అడుగుతున్నారు. ఇటువంటిది మన సమాజం అంటూ ఉదాహరణను వల్లించింది నటి హేమ. ఇటీవల కాలంలో సినీ నటుడు చలపతి బాబాయ్ ఒక్క మాట మాట్లాడితేనే దుమ్ము దులిపేసిన మహిళలు.. ఇప్పుడు శ్రీరెడ్డి అన్న *** మాటలను ప్రశ్నించరేం అంటూ నిలదీసింది.
see also : బాబుకు గట్టి షాక్..!