ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యే విధంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. సభా మర్యాదలు కించపర్చేలా వ్యవహరించిన ఈ ఎమ్మెల్యేల తీరును ఎండగట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇరువురు ఎమ్మెల్యేల వేటుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్‌లో న్యాయశాఖకు చెందిన ఉన్నతాధికారులు, న్యాయ కోవిదులతో మంతనాలు జరిపినట్టు సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేల వేటు విషయంలో ఎలా వ్యవహరించాలన్న అంశంపై తుదినిర్ణయం తీసుకోవలసింది స్పీకరేనని న్యాయనిపుణులు వివరించినట్లు తెలుస్తోంది.
see also :
నాగబాబుపై సంచలన పోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి..
హైకోర్టులో ఊరట లభించినా తీర్పును సమీక్షించే అధికారం శాసనసభాధిపతికి ఉందని న్యాయనిపుణులు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. స్వామిగౌడ్‌పై జరిగిన దాడికి సంబంధించి ప్రభుత్వం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని భావిస్తే తాము ఇచ్చిన తీర్పు అడ్డంకిగా ఉండబోదని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో వీరిపై కేసులు బనాయించేందుకు ముందుకు సాగుతున్నట్టు చెబుతున్నారు హైకోర్టు తీిర్పు సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో పాటు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై ఇయర్‌ఫోన్ విసిరిన సంఘటనకు సంబంధించి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చర్చ నడుస్తున్నట్లు సమాచారం.
see also:
కేసీఆర్ నిర్వహించిన అయుత చండీయాగం శక్తిమంతం..త్రిపుర సీఎం బిప్లవ్‌కుమార్ దేవ్