Home / CRIME / చీటింగ్‌కి కేరాఫ్ @ కరాచీ బేక‌రీ..!

చీటింగ్‌కి కేరాఫ్ @ కరాచీ బేక‌రీ..!

గతం లో బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’ సినిమా గుర్తుందా? మనల్ని గతకాలంలోకి, భవిష్యత్ కాలంలోకి వెళ్లే టైం మిషన్ అందులో ఉంటుంది. హైదరాబాద్ నగరంలో పేరుగాంచిన కరాచీ బేకరీ వాళ్ల దగ్గర కూడా అలాంటి టైం మెషిన్ ఉన్నట్లు తెలుస్తోంది! అందుకు ఈ బ్రెడ్ ప్యాకెట్ పై అతికించిన కాగితమే నిదర్శనం.

అసలు విషయం ఏమిటంటే .. హైదరాబాద్ నగరంలోని  ఉప్పల్ లో కరాచీ బేకరిలో ఓ వ్యక్తి బ్రెడ్ ప్యాకెట్ కొన్నాడు. మంచి  ఫేమస్ షాపు కదా అంతా ఫ్రెష్‌గానే ఉంటుందనిఅనుకున్నాడు కావచ్చు . అయితే తర్వాత కాస్త తీరిగ్గా బ్రెడ్ ప్యాకెట్  చూసి షాక్ తిన్నాడు. ప్యాకెట్‌పై ఉన్న కాగితంపై తయారీ తేదీ 05-10-2017 అని రాసి ఉంది. అంటే ఇంకా రాని తేదీలో దీన్ని తయారు చేశారని అర్థం చేసుకోవాలి. ఇదెక్కడి విడ్డూరమని విస్తుపోతూ అతడు ఆ స్లిప్ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టాడు. ప్రస్తుతం ఈ పోటో వైరల్ గా మారింది.  నిల్వ గడువును పెంచడానికి తయారీదారులు ఇలాంటి దగా చేశారని, పాతబ్రెడ్డును జనానికి అంటగట్టేందుకు కూడా ఇలా చేసి ఉంటారని జనం మండిపడుతున్నారు. కనుక.. మీరేదైనా  వస్తువులను  కొనేముందు కాస్త జాగ్రత్తగా చూసి మరీ కొనండి..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat