ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధికారంలోకి వస్తుందా ..గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు చేస్తున్న పలు అవినీతి అక్రమాలకు ..గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఆరు వందల ఎన్నికల హామీలను నెరవేర్చడంలో టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విఫలం కావడంతో
ఐదు కోట్ల ఆంధ్రులు వైసీపీ వైపు చూస్తున్నారా అంటే అవును అనే అంటున్నారు ఏపీ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు.
See Also:వైసీపీపై కుట్రలు చేస్తూ చిన్న లాజిక్ మరిచిపోయి అడ్డంగా బుక్ అయిన తెలుగు తమ్ముళ్ళు ..!
ప్రస్తుతం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే .అయితే జగన్ చేస్తున్న పాదయత్ర గురించి మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ పాదయాత్ర పేరిట వైసీపీ నేతలు వ్యాపారులు ,బడా బడా బిజినెస్ మెన్ల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు.వారు కూడా కోట్ల కోట్లు ఇస్తున్నారు అని ఆయన ఆరోపించారు.
See Also:మరో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు..?
అయితే ప్రస్తుతం భారతదేశంలో పలు రాజకీయ పార్టీలకు వ్యాపారవేత్తలు ,ప్రముఖులు డబ్బులను విరాళాల రూపంలో ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాము .అయితే సదరు వ్యాపారవేత్తలు,ప్రముఖులు అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉండటం ..ప్రజలకిచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలం అవ్వడం ఇలా పలు కారణాల వలన పార్టీ మార్పు కోసం కనీసం వచ్చే వేరే పార్టీ అయిన తమకు ,ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేస్తారు అని నమ్మకంతో విరాళాలు ఇస్తారు .అయితే మంత్రి పరోక్షంగా తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాదు..వైసీపీ పార్టీ రావడం ఖాయమని పరోక్షంగా చెప్పినట్లు అయింది అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు ….
See Also:వైసీపీలోకి ఫిరాయింపు ఎమ్మెల్యేలు ..జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా ..!