వచ్చే నెలలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారీగా సొమ్ము పట్టబడటం కర్ణాటకలో కలకలం రేపింది. మంగళవారం ఉదయం బెంగళూరు-అనంతపురం రహదారిపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో చిక్ బల్లాపూర్.. తిప్పగానిపల్లి వద్ద వెంకటేశ్వర ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు నుంచి నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 100 కోట్లపైగానే సొమ్ము ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనలో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న కర్ణాటక పోలీసులు.. నగదును ఎక్కడికి, ఎందుకు తరలిస్తున్నారన్న విషయంపై దర్యాప్తు చేపట్టారు.
అయితే ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పార్టీలు ప్రయత్నిస్తుండగా.. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీతో సాన్నిహిత్యం ఉండటంతో ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ పార్టీను ఓడించాలనే లక్ష్యంతో స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పంపిస్తున్నాడు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.అందులో భాగంగా ఇటివల ఏకంగా ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి బెంగుళూర్ లో ప్రెస్ మీట్ పెట్టి మరి తెలుగు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని చెప్పడం కూడా ఈ వాదనలకు బలం చేకూర్చుతుంది .అంతే కాకుండా చంద్రబాబు నాయుడు కూడా నిన్న కాకా మొన్న ప్రెస్ మీట్ లో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న తెలుగు వారు బీజేపీ పార్టీకి ఓట్లు వేయద్దని కూడా పిలుపునిచ్చారు ..చూడాలి మరి గతంలోనే ఉమ్మడి రాష్ట్రంలో జగన్ అప్పటి కాంగ్రెస్ పార్టీ సర్కారు మీద అసెంబ్లీ లో పెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు ..