జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కి రేణుదేశాయ్ రూపంలో కొత్త సంకటం పుట్టుకొచ్చింది. పవన్ కళ్యాణ్‌తో విడాకులు తీసుకున్నాక ఒంటరి జీవితం గడుపుతున్న రేణు ఇటీవల ఇచ్చిన ఇటర్వ్యూలో మళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నానని చెప్పి హాట్ టాపిక్‌గా మారింది. దీంతో రెండో పెళ్ళి ముచ్చట వివాదాస్పదమవడం.. పవన్ అభిమానుల పేరుతో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించడంతో రేణుదేశాయ్ కూడా సీరియస్‌గా తీసుకుని.. మగాళ్ళు మాత్రం ఎన్ని పెళ్లిళైనా చేసుకోవచ్చు.. ఆడవాళ్ళు మాత్రం అలాంటి ఆలోచన కూడా చేయకూడదా. అని ప్రశ్నించేసింది. ఇకనేం, పవన్‌ని డైరెక్ట్‌గా రేణు ప్రశ్నించినట్లయ్యిందిక్కడ. పవన్ మొదటి పెళ్ళి పెటాకులు చేసుకున్నాడు.. రెండో పెళ్ళీ పెటాకులు చేసేసుకున్నాడు.. మూడో పెళ్ళి చేసుకుని, మూడో భార్యతో జీవనం సాగిస్తున్నాడు.
అలాంటప్పుడు రేణు దేశాయ్ రెండో పెళ్ళి ఎందుకు చేసుకోకూడదట.. ఇదే అంశం చుట్టూ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే జరుగుతోంది.అది కూడా నిజమే.. అయితే ఇప్పుడిప్పుడే పవన్ 2019 ఎన్నికల నాటికి రాజకీయంగా జనసేన పార్టీని యాక్టివ్ చేయాలనుకుంటున్న పరిస్థితుల్లో.. రేణు దేశాయ్ రాజేసిన కుంపటి జనసేన పార్టీకి ఖచ్చితంగా ఇరకాటంలో పడేసే విషయం అని చెప్పొచ్చు. అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కోసమే అప్పటిదాకా రేణుదేశాయ్‌తో సహజీవనం చేస్తోన్న పవన్.., ఆమెను వివాహం చేసుకున్న విషయం విదితమే. ఆ టైమ్‌లో పవన్ – రేణు సహజీవనంపై విమర్శలు రావడం, అన్నయ్య సూచనతో ఆ విమర్శలకు చెక్‌పెట్టేందుకు పవన్ పెళ్ళిపీటలెక్కడం జరిగాయి. ఇప్పుడేమో పవన్ 2019 ఎన్నికలకు సిద్ధమవుతోంటే అదే రేణు దేశాయ్ రూపంలో రాజకీయంగా పవన్‌కు మరోసారి ఇబ్బందులు ఎదురయ్యేలా కన్పిస్తోందని.. భూమి గుండ్రంగా వుండడం అంటే ఇదేనేమో అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.