ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ముగించుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చింది. 136 రోజులు అవివరామంగా, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వైఎస్ జగన్ అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు తమకు పింఛన్ రావడం లేదని, నిరుద్యోగులు అయితే, చంద్రబాబు సర్కార్ ఉద్యోగాల నోటిఫికేషన్లు వదలడం లేదని, రుణమాఫీ, డ్వాక్రా రుణాలు ఇలా వారి వారి సమస్యలను వైఎస్ జగన్ తో చెప్పుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. శనివారం కృష్ణా జిల్లా విజయవాడ వద్ద వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్ ప్రజలతో మాట్లాడుతూ.. నేను ఒక్కటే చెప్తున్నా..!, గర్వంగా చెప్తున్నా..!! మా నాయన మేనత్తలు అందరూ ఎస్సీలనే పెళ్లి చేసుకున్నారు. నేను ఈ రోజు మామ అని పిలిచే వాళ్లందరూ ఎస్సీలే. అందుకు నేను గర్వపడుతున్నా. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అంటూ సీఎం చంద్రబాబు, ఎస్సీలు స్నానం చేయరు అంటూ మంత్రి ఆదినారాయణరెడ్డి మాదిరి వ్యాఖ్యలు చేయడం నాకు చేతకాదు, దళితులంటే నాకు ప్రేమ, ఆప్యాయత అంటూ వైఎస్ జగన్ చెప్పారు. ఒక్కసారిగా వైఎస్ జగన్ అన్న ఈ మాటతో ఆ సభలో పాల్గొన్న దళితులంతా ఒక్కసారిగా హర్షం వ్యక్తం చేస్తూ ఈళలతో ఆ ప్రాంగణాన్ని మారు మ్రోగించారు. జగన్ సభ జరుగుతున్నంత సేపూ సీఎం.. సీఎం అంటూ కేకలతో హోరెత్తించారు.