ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నాలుగున్నర నెలలుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి విదితమే .జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.అయితే అప్పటి ఉమ్మడి ఏపీలో దాదాపు తొమ్మిదేళ్ళ ప్రస్తుత నవ్యాంధ్ర అధికార పార్టీ తెలుగుదేశం అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసిన సంగతి తెల్సిందే .
పాదయాత్ర సందర్భంగా వైఎస్సార్ ప్రజల నుండి తెలుసుకున్న పలు సమస్యలను తెలుసుకొని వాటిని ఎన్నికల హమీలుగా కురిపించి అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఆయన నాడు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాడు .తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరిట వరాలను ప్రజలకు వివరిస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేస్తామని సవివరంగా వివరిస్తున్నాడు జగన్ .
అయితే అప్పటి వైఎస్సార్ పాదయాత్రకు వచ్చిన ప్రజాస్పందన నేడు జగన్ చేస్తున్న పాదయాత్రకు వస్తున్నా ప్రజాస్పందనను చూస్తుంటే మారింది కాలమే కానీ ప్రజల నుండి స్పందన కాదు ..అప్పటికి ఇప్పటికి వైఎస్సార్ కుటుంబం పట్ల ఉన్న ప్రజాస్పందన తగ్గలేదని నిరూపిస్తుంది ..మీరు ఒక లుక్ వేయండి ..